రాజీనామా చేయ‌ను అంటున్న ఎంపీ

ఏపీ ప్ర‌భుత్వంపై వైకాపా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మండిప‌డ్డారు. జ‌గ‌న్ బొమ్మ‌తో తాను గెల‌వ‌లేద‌ని అందుకే తాను రాజీనామా చేయ‌బోన‌ని ఆయ‌న అన్నారు.

త‌న‌ను రాజీనామా చేయ‌మ‌ని చెప్ప‌డానికి మీరెవ‌ర‌ని.. తాను ప్ర‌జామోదంతో గెలిచాన‌ని ర‌ఘురామ‌కృష్ణ రాజు అన్నారు. కొంద‌రు కావాల‌నే త‌న‌ను రెచ్చ‌గొడుతున్నార‌న్నారు. మీ పరిధి దాటి వ్యవహరించొద్దన్నారు. నూటికి నూరు శాతం అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఉంటుంద‌న్నారు.

ఏపీ పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్‌డీఏ ర‌ద్దు చట్టాల‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగిన దానిపై ఆయ‌న స్పందించారు.ఒక్క రాజ‌ధాని క‌ట్టేందుకే డ‌బ్బులు లేకుంటే మూడు రాజ‌ధానులు ఎలా క‌డ‌తార‌న్నారు. గుర్రంపాటి దేవేంద‌ర్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై సీఎస్‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌న్నారు. సీఎం కూడా స్పందించ‌లేద‌న్నారు.

అందుకే దేవేంద‌ర్ రెడ్డిపై లోకాయుక్త‌లో దేవేంద‌ర్ రెడ్డిపై ఫిర్యాదు చేశాన‌న్నారు.ఇక ఒక సామాజిక వ‌ర్గం నాయ‌కులు త‌న‌పై మాట‌ల దాడులు చేస్తున్నార‌ని, వైసీపీ నేత‌లు త‌న‌ను రాజీనామా చేయాల‌ని చెబుతున్నార‌న్నారు. అయితే తాను జ‌గ‌న్ బొమ్మ‌తో గెల‌వ‌లేద‌ని.. అందుకే రాజీనామా చేయ‌బోన‌న్నారు ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here