వైఎస్సార్ పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు.. నిజ‌మేనా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్య‌నిర్వాహ‌క రాజధానిగా వెల‌గబోతున్న విశాఖ‌ప‌ట్నంలో అధికార పార్టీలో అంత‌ర్గ‌త విభేధాలు ఉన్న‌ట్లు వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న నేత‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని తెలుస్తోంది.

2019 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో వైసీపీ అత్య‌ధిక మెజార్టీతో విజ‌యం సాధించిన విషయం తెలిసిందే. అయితే కేవ‌లం జ‌గ‌న్ ఇమేజ్‌తోనే ఇంత పెద్ద మొత్తంలో మెజార్టీ సాధించార‌ని అంతా అనుకుంటున్నారు. వైఎస్ కుమారుడిగా వై.ఎస్ జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఇలా ప్ర‌జాదార‌ణ పొందార‌ని అంద‌రికీ తెలిసిందే.

ఇలాంటి ప‌రిస్థితుల్లో విశాఖ‌ప‌ట్నంలో పార్టీ నాయ‌కుల తీరు ఆయ‌న‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీ‌నివాసరావు, మ‌రో ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ల మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని విశాఖ పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్‌లో కీ పాయింట్‌గా ఉంది.

విజ‌య‌సాయిరెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. జ‌గ‌న్‌కు అత్యంత కావాల్సిన వ్య‌క్తుల్లో ఆయ‌న‌పేరు ముఖ్యంగా చెబుతారు. వైఎస్ జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల్లో తోడుగా ఉండి ప్ర‌తి విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు విజ‌య‌సాయిరెడ్డి. అన్నీ తానై న‌డిపించిన విజ‌యసాయిరెడ్డికి, మంత్రి ముత్తంశెట్టి, ఎంపీ ఎంవీవీ మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి హ‌వా కొన‌సాగుతుంటే మిగిలిన వారు ఓర్వ‌లేక‌పోతున్న‌ట్లు స‌మాచారం. ఎవ‌రికి వారు వ‌ర్గాలుగా విడిపోయి పార్టీ నేత‌ల్లో చీలిక తీసుకొచ్చిన‌ట్లు ప‌లువురు మాట్లాడుకుంటున్నారు. దీంతో ఎవ‌రికి వారు పై చేయి సాధించేందుకు ప్ర‌త్య‌ర్థుల‌ను అణ‌చివేసేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు అనిపిస్తోంది. పైగా విజ‌యసాయిరెడ్డికి మంత్రి బొత్స‌కు మ‌ద్య అంత‌గా స‌త్సంబంధాలు లేవ‌ని అందుకే విజ‌యసాయి యాంటీ వ‌ర్గం మంత్రికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని టాక్‌.

మొత్తం మీద ఈ వ్య‌వ‌హారం అధినేత జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్లిన‌ట్లు స‌మాచారం. పార్టీ ముఖ్య‌మ‌ని నేత‌లంతా క‌లిసిక‌ట్టుగా ఉండి పార్టీని మ‌రింత ప‌టిష్టం చేయాలి త‌ప్ప ఇలా ఒక‌రిపై ఒక‌రు విభేధాలు సృష్టించుకోవ‌ద్ద‌ని న‌చ్చజెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ వీరి మాత్రం మార‌లేద‌ని తాజాగా పుకార్లు వ‌స్తున్నాయి. మరి ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెట్టిన జ‌గ‌న్‌.. పార్టీ విష‌యంలో కూడా కొంచెం శ్ర‌ద్ద పెట్టాల‌ని వై.ఎస్ జ‌గ‌న్ అభిమానులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here