రాజీనామాలు చేసేసిన వైసీపీ ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిమిత్తం రాష్ట్రపతి పక్ష పార్టీ వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. గతంలో వీరు పార్లమెంట్ సభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే అనేక నిరసనలు ఆందోళనలు చేయడం జరిగింది..అయితే ఈ క్రమంలో కేంద్రంలో జనం రాకపోవడంతో అసహనం చెంది తమ పదవులకు రాజీనామా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో ముఖ్యంగా విభజన సమయంలో రాష్ట్రానికి ఇస్తాను అని చెప్పిన ఇటు రాష్ట్రంలో టీడీపీ ,అటు కేంద్రంలో బీజేపీ సర్కారు ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన తీరును నిరసిస్తూ గత ఎనిమిది రోజులుగా వైసీపీ పార్టీ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టడం..స్పీకర్ సభను వాయిదా వేయడం మనం చూస్తూనే ఉన్నాం .
దీంతో సభలో అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగదని భావించిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,మిథున్ రెడ్డి ,వరప్రసాద్ ,అవినాష్ రెడ్డి ,మేకపాటి రామోహన్ రెడ్డి తమ రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు.తమ రాజీనామా పత్రాలన్నీ స్పీకర్ ఫార్మట్ లో ఉండే విధంగా రాజీనామా చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా పర్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో రాజకీయం మరింత వేడెక్కింది. అంతేకాకుండా బిజెపిపై కూడా రాష్ట్ర ప్రజలలో తీవ్ర అసహనం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here