భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకల వేదిక మార్పు 

ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు గతంలో ముందుగా వైజాగ్లో చేయాలని నిర్ణయించారు. అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల వైజాగ్ నుండి విజయవాడకు ప్లాన్ చేశారు సినిమా యూనిట్. అయితే రాజకీయ పరిణామాలతో వేదికను విజయవాడకు మార్చడంతో వివాదాలు తలెత్తే అవకాశం ఉండనే అభిప్రాయానికి అటు మహేష్ తో పాటు చిత్ర యూనిట్ బావించింది.
ముక్యంగా ఈ విషయంలో మహేష్ కు అక్కడ చేయడం ఇష్టం లేదట… అందుకే ఈ వేడుకను హైద్రాబాద్ లోనే చేయాలనీ నిర్ణయం తీస్తుకున్నట్టు తెలుస్తోంది. సో భరత్ అనే నేను ఈవెంట్ హైద్రాబాద్ లోనే జరిగనున్నట్టు తెలిపారు. సహజంగానే రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ ఈ సినిమా వల్ల రాజకీయ వివాదాలకు కారణం కాకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడట.
మహేష్ తీసుకున్న నిర్ణయంతో బావ గల్లా జయదేవ్ కూడా మంచి నిర్ణయం తీసుకున్నామని అన్నారట. దీంతో రాజకీయాల జోలికి వెళ్లకుండా మహేష్ తన ముఖ్యమంత్రి సినిమాని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రల్లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here