అఖిల్ కొత్త సినిమా హీరోయిన్

తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ మూడో సినిమా ప్రారంభం అయ్యింది. అక్కినేని కుటుంబం నుండి హీరోగా పరిచయమైన అఖిల్ ఇప్పటిదాకా సరైన హిట్టు కో ట్టలేకపోయాడు. దీంతో సరైన సినిమా కథ కోసం చాలా గ్యాప్ తీసుకుని చేసిన హలో కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. దాంతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని కసితో ఈ సారి యువ దర్శకుడితో సినిమాకు కమిట్ అయ్యాడు అఖిల్.

అయితే అయన చేసిన రెండు సినిమాల్లో కొత్త హీరోయిన్స్ తీసుకోవడం వల్ల వాళ్లు సినిమాకు పెద్దగ ప్లస్ కాలేకపోయారని ఈ సారి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మరి అఖిల్ సరసన నటించే ఆ క్రేజీ హీరోయిన్ ఎవరన్నది త్వరలోనే ప్రకటిస్తారట. కుదిరితే రాశి ఖన్నా ని హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు తొలిప్రేమ డైరెక్టర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here