తన రెండు సినిమాలలో హీరోయిన్ శ్రీ రెడ్డి ని తీసుకున్న సంచలన దర్శకుడు

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడం లేదని ఇటీవల శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి ఇంటర్నెట్ ప్రముఖ చానల్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇలా కామెంట్ చేయడం వల్ల శ్రీరెడ్డి కి అవకాశాలు రావు అని చాలామంది అన్నారు..కానీ తాను చేస్తోన్న రెండు సినిమాల్లో ఆమెకి అవకాశం ఇస్తున్నట్టుగా చెప్పి దర్శకుడు తేజ అందరినీ ఆశ్చర్యపరిచారు.
శ్రీరెడ్డి ఆరోపణలను గురించి విని ఆమెను పిలిపించి మాట్లాడాననీ, ఆమెకి అన్యాయం జరిగిందనే తనకి అనిపించిందని అన్నారు. రెండు సినిమాల్లో ఆమెకి అవకాశాలు ఇస్తున్నట్టుగా చెప్పారు. ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు వెంకటేశ్ తోను తేజ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏదేవైనా రెండు పెద్ద ప్రాజెక్టులలో శ్రీరెడ్డికి అవకాశాలు దక్కడం విశేషమే. దీంతో శ్రీరెడ్డి ఎంతో సంతోషించి కృతజ్ఞతలు తెలిపింది డైరెక్టర్ తేజకి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here