చంద్రబాబు పెద్ద బ్రోకర్: మోహన్ బాబు

టాలీవుడ్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్బాబు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై విరుచుకు పడ్డారు. ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్  తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన చేసిన కామెంట్స్ విషయంలో చాలా తీవ్రంగా స్పందించారు మోహన్ బాబు.

తాజాగా విదేశాల్లో ఉన్న మంచు మోహన్ బాబు మాట్లాడుతూ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు సినిమవాళ్ళను టార్గెట్ చేశారని వార్తలు విన్నాను.సినిమావాళ్ళు బ్రోకర్లు ..ఇలా ఏదో మాట్లాడుతున్నారు అంట.అసలు వాళ్ళ బాస్ ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటే పెద్ద బ్రోకర్ ఎవరు ఉన్నారు. ప్రపంచంలో బాబు అంత బ్రోకర్ పనులు చేసే మరొకడు ఉండడు.పార్టీలోకి పిలిచి పదవులిచ్చి ..పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి చావుకు కారణమైన చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న వారా ఇండస్ట్రీ వాళ్ళను తిట్టేది.మీరు ఓట్లు వేయించుకున్నారు.

గెలిపించుకున్నారు.మీరేదో చేస్తారని నమ్మితే మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఇప్పుడు మాపై తిరగబడతారా ..మేము తలచుకుంటే మీకు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాం ..మమ్మల్ని మీ స్వార్ధ రాజకీయాల్లోకి లాక్కండి .నిజంగా మా అవసరం ప్రజలకుంటే వాళ్ళు పిలిస్తే నేనే ముందు వస్తా అని ఆయన చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు ..తెలుగు ఇండస్ట్రీ ఆంధ్ర రాష్ట్రానికి చాలా విషయాలలో  సంబంధించిపాల్గొని సేవ కార్యక్రమాలు చేసింది. అంతెందుకు మీరు అధికారంలోకి రావడానికి కూడా ఒక తెలుగు హీరో కారణమని గుర్తుపెట్టుకోండి అంటూ మోహన్ బాబు చురకైన మాటలతో చంద్రబాబుకి అర్థమయ్యేలా పరుష పదజాలంతో మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here