వైయస్ జగన్ కి రాష్ట్రంలో అడుగడుగునా జన నీరాజనం

40 ఏళ్లు రాజకీయాలలో ఉన్న నాయకులకు చమటలు పట్టిస్తూ దర్జాగా ప్రజల మధ్య వారి ఆదరాభిమానాలను గెలుచుకుంటూ ముందుకు వెళుతున్నాడు వైసిపి అధినేత వైఎస్ జగన్. ప్రజా సంకల్ప పాదయాత్ర అంటూ మొదలు పెట్టిన జగన్ కి రాష్ట్రంలో వృద్ధులు మహిళలు పిల్లలు పెద్దలు యువత బ్రహ్మరథం పడుతున్నారు. ఒకపక్క అధికారపార్టీ తెలుగుదేశాన్ని దాన్ని కూటమి చీల్చుకుంటూ రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ముందుకెళ్తున్న జగన్ ఒక విధంగా చాలా సక్సెస్ సాధించాడు.

పాదయాత్ర మొదలయి సగం కిలోమీటర్లు నడిచే సరికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. మరి పూర్తయితే చంద్రబాబు సీఎం కుర్చీలో ఉంటాడో లేదో చూడాలి మరి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి సమస్యలను సావధానంగా వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నారు. అంతేగాక నడవలేని అవ్వ..నిలబడలేని తాత..మాటలు కూడ రాని చిన్నారులు…ఇలా వేల మంది వైఎస్ జగన్ తో అడుగులో అడుగు వేస్తున్నారు. మీరు రావలయ్యా ఏపీలో మీ తండ్రి లాంటి పాలన కావలయ్యా అంటూ వైఎస్ జగన్ తోనే ప్రజలు చెబుతున్నారు. వారి మాటలకు జగన్.. ఖచ్చితంగా మీ అందరి ప్రేమాభిమానంతో రాబోయో ఎన్నికల్లో మనందరి ప్రభుత్వం రాగనే మీకు కష్టాలు అనేవి లేకుండ చెద్దాం అని భరోస ఇస్తున్నారు. రాబోయే రోజులు మనవే అంటూ జనాలకి ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు జగన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here