పవన్ కళ్యాణ్ పార్టీ టైం పొలిటికల్ లీడర్: శివాజీ

ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చేయుట శివాజీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మన గుంటూరు వేదికగా పార్టీ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆయన కుమారుడు లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేయడంతో హీరో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితం అంటూ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు.
అంతేకాకుండా  ప‌వ‌న్ రాజ‌కీయ అడుగుల విష‌యంలో ఆయ‌న స్ప‌ష్ట‌తతో ఉండాల‌ని శివాజి అన్నారు. పవన్ కల్యాణ్‌కు వ్యక్తిగతంగా పెద్ద అభిమానిని అని శివాజి తెలిపారు. ప్రశ్నించండి అని పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్ పిలుపుతోనే తాను ప్రశ్నిస్తున్నానని పేర్కొంటూ ఏపీకి న్యాయం చేయాలని కోరారు.లోకేష్ అవినీతిప‌రుడ‌ని ప‌వ‌న్ ఆరోప‌ణ‌లు చేశార‌ని గుర్తు చేసిన శివాజీ ఆధారాలు ఏవ‌ని అడిగితే…బ‌య‌ట చ‌ర్చించుకుంటున్నార‌ని వ్యాఖ్యానించార‌ని శివాజి పేర్కొన్నారు.
లోకేష్ అవినీతి పరుడు కాదని శివాజీ తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వంలో అవినీతి జరిగింద‌న్నారు.  భ‌విష్య‌త్‌లో పవన్ అధికారంలోకి వచ్చినా అవినీతి చేయాల్సిందేన‌ని శివాజీ వ్యాఖ్యానించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు శివాజీ పై మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్యాయంగా దోచుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కరెక్టే అంటూ శివాజీ పై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడిపై అభిమాన హీరో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ శివాజీని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here