కాజల్ నయనతార బాటలో తమన్నా

ఒకప్పుడు తెలుగు హీరోయిన్లలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తమన్నా రాను రాను క్రేజ్ పోవడంతో ఎటువంటి సినిమాలు చేయడానికైనా రెడీ అయిపోతుంది. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోల ప్రక్కన నటించడానికి సిద్ధమౌతోంది తమన్నా. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌తో అనిల్‌ రావిపూడి తీసే ఎఫ్‌2లో వెంకీ సరసన తమన్నా నటిస్తుందని వినిపిస్తోంది. చరణ్‌తో పలు చిత్రాల్లో నటించిన తమన్నాకి వరుణ్‌ సరసన ఆఫర్‌ రాలేదట.
వెంకీ పక్కన కూడా గ్లామర్‌ వున్న తార అయితే బాగుంటుందని అనిల్‌ రావిపూడి చెప్పడంతో తమన్నాని సంప్రదించారట. ఆమె రెగ్యులర్‌గా తీసుకునే పారితోషికానికి మించి ఇవ్వడానికి సిద్ధంగా వుండడంతో ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు టాక్‌ వినిపిస్తోంది. ఇదే బాటలో కాజల్ నయనతార ప్రస్తుతం తమ కెరీర్ ని  ముందుకు సాగిస్తున్నారు ఇప్పుడు ఈ లిస్టులో తమన్నా కూడా చేరిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here