రకుల్ ప్రీత్ సింగ్ పై మండిపడ్డ మాధవిలత

క్యాస్టింగ్ కౌచ్ విషయంపై తెలుగు టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది మాదవి లత. ప్రపంచంలో ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అనే రగడ ప్రతి ఇండస్ట్రీలో నెలకొంది ఈ నేపధ్యంలో హాలీవుడ్ ఇండస్ట్రీలో తారాస్థాయికి చేరింది ఈ వివాదం. అయితే ఇటీవల తెలుగు సినిమా రంగానికి చెందిన వారు కూడా ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిం చడం జరిగింది. ఇండస్ట్రీలో దర్శకులను నిర్మాతలను శారీరకంగా సంతృప్తి పరిస్థితే గానీ అవకాశాలు రావు అన్న వ్యాఖ్యలతో నేను ఏకీభవించను అంది రకుల్ ప్రీత్ సింగ్.

నాకు ఎప్పుడూ ఇటువంటి అనుభవం ఎదురు లేదని అంది. దీంతో హీరోయిన్ మాధవి లత మాట్లాడుతూ రకుల్ చెప్పింది అబద్దం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. హాలీవుడ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ బాధితులు చాలా మంది ఉన్నారు. బయటకు వచ్చి మీటూ క్యాంపైయిన్ ఏర్పాటు చేశారు. తెలుగులో మాత్రం ఎవరు సపోర్ట్ చేయటానికి ముందుకు రారు. ప్రతి చోట ఇది ఉంది. ఒక్క సినిమా ఇండుస్త్రీలలోనే కాదు. రకుల్ గారు చెబుతున్నది చాలా అబద్దం. హాలీవుడ్ లోనే జరుగుతోంది అంటే ఇక్కడ జరగదా?. మరి జనాలను పిచ్చోళ్ళని చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ అయ్యుండి తోటి హీరోయిన్ల బాధలను చెప్పుకుంటే ఇలా  పక్క దోవ పట్టించడం రాకుల్ ప్రీత్ సింగ్ కి తగదు అని అంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here