వైఎస్సార్‌, చంద్ర‌బాబు మూవీ రెడీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌ వై.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి,  నారా చంద్ర‌బాబు నాయుడుల మీద ఓ సినిమా తీస్తున్నారు. డైరెక్ట‌ర్ దేవాకట్టా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్రూడోస్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై హ‌ర్ష‌.వి, తేజ‌.సి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఏపీ రాజ‌కీయాల్లో వై.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు గురించి చెప్పాలంటే మాట‌లు చాల‌వు.  ఎందుకంటే టిడిపి త‌రుపున చంద్ర‌బాబు, కాంగ్రెస్ త‌రుపున వైఎస్సార్ ముఖ్య‌మంత్రులుగా పోటాపోటీగా ప‌నిచేశారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో వీరిది ప్ర‌త్యేక పాత్ర అని చెప్పొచ్చు.

అలాంటిది వీరి గురించి ఇప్పుడు ఓ సినిమా వ‌స్తోందంటే పొలిటిక‌ల్‌గానే కాకుండా రాష్ట్రమంతా ఆస‌క్తిగా ఉంటారు. డైరెక్ట‌ర్ దేవాక‌ట్ట వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహం, రాజ‌కీయ వైరం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు ఇంద్ర‌ప్ర‌స్థం అనే పేరు పెట్టారు. సినిమాకు సంబంధించిన మోష‌న్ పిక్చ‌ర్‌ను నేడు రిలీజ్ చేశారు.

సినిమాలో మూడు ద‌శాబ్దాల‌ చంద్ర‌బాబు, వైఎస్సార్ స్నేహ బంధం, పొలిటిక‌ల్ వైర‌ల్ అంశాలు ఇందులో చూపించ‌నున్నారు. ఇద్ద‌రు స్నేహితులు ఓ పోటీలో పాల్గొన్న‌ప్పుడు అది చాలా ఆస‌క్తిక‌రంగా మారుతుంది. అనే డైలాగ్ మోష‌న్ పోస్ట‌ర్‌ను వాయిస్ ఓవ‌ర్‌లో విడుద‌ల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here