న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై ముంద‌డుగు వేసిన వై.ఎస్ జ‌గ‌న్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం, న్యాయ‌వ్య‌వ‌స్థ మ‌ధ్య జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆస‌క్తిగా మారాయి. ప‌లు విష‌యాల్లో కోర్టు ఉత్త‌ర్వుల‌పై అభ్యంత‌రం చెబుతున్న సీఎం వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ విష‌యంపై చాక‌చ‌క్యంగానే వ్య‌వ‌హ‌రించాల‌ని డిసైడ్ అయ్యారు. అందుకే న్యాయ వ్య‌వ‌స్థ వ్య‌వ‌హారంలో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని క‌లిశారు.

ఏపీలో జ‌రుగుతున్న ప‌రిస్థితులు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై న్యాయ‌వ్య‌వ‌స్థ జోక్యం చేసుకోవ‌డం వివాదాల‌కు దారి తీస్తోంది. అయితే ఈవిష‌యాల‌పై ఇప్ప‌టికే పార్ల‌మెంటులో సైతం వైసీపీ ఎంపీలు ప్ర‌స్తావించారు. కాగా దీన్ని తేల్చుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్లు మ‌న‌కు అర్థ‌మ‌వుతోంది. సుప్రీంకోర్టు సీజేను క‌లిసిన జ‌గన్‌.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి ఎన్‌.వి ర‌మ‌ణ పేరును ప్ర‌స్తావించ‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చనీయాంశం అయ్యింది.

సీఎం స్థాయి వ్యక్తి సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి ప‌ట్ల ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఇప్పుడు అంతా ఆస‌క్తిగా చూస్తున్నారు. ఈ విష‌యంలో సీజేఐ ఎలా ముందుకు వెళ‌తార‌న్న ఉత్కంఠ‌త నెల‌కొంది. ఎన్.వి ర‌మ‌ణ‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు మ‌ధ్య స్నేహం వ్య‌వ‌హారం గురించి సీజేఐకి వివ‌రించ‌డం కూడా ఇక్క‌డ ప్ర‌ధానంగా చెప్పుకోవాలి. చంద్రబాబు హ‌యాంలో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ చేస్తున్న త‌రుణంలో ఎన్‌.వి ర‌మ‌ణ కుమార్తెల‌పై కూడా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ప్ర‌స్తావించారు. ప్ర‌ధానంగా ఈ విచార‌ణ‌లో ఏం జ‌రుగుతోందో.. ప్ర‌భుత్వాన్ని ఎలా అడ్డుకుంటున్నారో స్ప‌ష్టంగా చెప్పారు.

అయితే న్యాయ వ్య‌వ‌స్థ‌, శాస‌న‌, కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌లు ఒక‌దానికొక‌టి మితిమీరి జోక్యం చేసుకోవడానికి వీల్లేద‌ని జ‌గ‌న్ లేఖ‌లో తెలిపారు. మ‌రి ఏపీలో జ‌రుగుతున్న ప‌రిస్థితులు మాత్రం ప్రభుత్వానికి పూర్తి వ్య‌తిరేకంగా. అడ్డుత‌గిలేలా ఉన్నాయి. ఈ త‌రుణంలో జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here