నేర‌స్తుల‌కు ఎందుకు టికెట్ ఇచ్చారో వివ‌ర‌ణ ఇస్తున్న పార్టీలు..

ఎన్నిక‌లొచ్చాయంటే రాజ‌కీయ నాయ‌కుల వ్య‌క్తిగ‌త జీవితం గురించి చ‌ర్చ వ‌స్తుంది. తాజాగా బీహార్ లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో దేశం మొత్తం బీహార్ వైపే చూస్తోంది. అయితే ఎన్నిక‌ల్లో నేర చ‌రిత్ర ఉన్న వారికి టికెట్లు ఇచ్చార‌న్న ఆరోప‌ణ‌లు ఇప్పుడు ఎక్కువ అయ్యాయి. దీంతో పార్టీలు దీనిపై వివ‌ర‌ణ ఇస్తున్నాయి.

బీహ‌ర్ ఎన్నిక‌ల్లో చాలా పార్టీల అధినేత‌లు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల పేర్ల‌ను విడుద‌ల చేశారు. అయితే వీరిలో ప‌లువురు నేర చ‌రిత్ర క‌లిగిన వారు ఉన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెల‌రేగుతోంది. ఇప్పుడు సోష‌ల్ మీడియా వ‌చ్చిన నేప‌థ్యంలో వీరి గురించి చ‌ర్చ ఎక్కువ‌వుతోంది. దీన్ని ప‌లువురు రాజ‌కీయంగా కూడా వాడుకుంటున్నారు. దీంతో పార్టీల అధినేత‌లు నేర చ‌రిత్ర క‌లిగిన వారికి ఎందుకు టికెట్ ఇస్తున్నారో వివ‌రణ ఇస్తున్నారు.

ఇటీవల ఆర్జేడీ విడుదల చేసిన అభ్యర్థులలో నేరపూరిత చరిత్ర కలిగినవారు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న కిర‌ణ్ దేవి గురించి మాట్లాడుతూ ఈమె మహిళా గ్రూపులను నడుపుతున్నారని, ఆమెకు మహిళల నుంచి ఎంతో ఆదరణ ఉందని, మహిళల ప్రగతి కోసం గ్రామాల్లో పర్యటిస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలు  చేపట్టారని ఆర్జేడీ పేర్కొంది. అందుకోస‌మే ఈమెకు పార్టీ టికెట్ ఇచ్చింద‌ని క్లారిటీ ఇచ్చారు. త‌ర్వాత  సూర్యగఢ్ నుంచి బరిలోకి దిగిన ప్రహ్లాద్ యాదవ్ గురించి ఆర్జేడీ వివరణ ఇస్తూ… ప్రహ్లాద్ యాదవ్ రాజకీయంగా తన నియోజకవర్గంలో ప్రజాదరణ పొందిన బలమైన అభ్యర్థి కావున అందుకే టికెట్ ఇచ్చామ‌ని తెలిపింది.  ఇక మ‌రో టికెట్ బెల్హ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగిన రామ్ దేవ్ యాద‌వ్ విష‌యంలో కూడా ప్ర‌జ‌ల్లో మంచి పేరు ఉన్న‌ట్లు తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here