అక్క‌డా ఇక్క‌డా కాదు టిటిడిపైనే వై.ఎస్ జ‌గ‌న్ ప్లాన్‌..

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టిటిడి)పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌తిదాంట్లో ప్ర‌క్షాళన దిశ‌గా ముందుకు వెళుతున్న సీఎం అత్యంత ప్ర‌ముఖ‌మైన టిటిడిపై అడుగు ముందుకు వేసిన‌ట్లు తెలుస్తోంది. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ వ్య‌వ‌హారం కూడా దీనికి బ‌లం చేకూర్చుతోంది.

ఇటీవ‌ల తిరుమ‌ల డిక్ల‌రేష‌న్ అంశం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే సీఎం జ‌గ‌న్ సాంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొని ఎవ్వ‌రికీ ఏ కామెంట్ చేసేందుకు ఆస్కారం ఇవ్వ‌కుండా త‌న పని తాను ముగించుకొని వెళ్లిపోయారు. దీంతో అప్ప‌టిదాకా రాద్దాంతం చేసిన ప్ర‌తిప‌క్షాలు సీఎం వ‌చ్చి వెళ్లిన త‌ర్వాత మ‌రో మాట మాట్లాడ‌లేదు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ తిరుమ‌ల‌పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన తిరుమ‌ల‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఏ చిన్న లోటు లేకుండా ప్ర‌పంచం గ‌ర్వించేలా చేయాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు చెప్పుకోవ‌చ్చు. ఇందులో భాగంగానే మొద‌ట‌గా ఇప్పుడు ఈవో అనిల్‌ను బ‌దిలీ చేశారు. ఈయ‌న స్థానంలో ఏపీ ప్ర‌భుత్వ వైద్య‌, ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న జ‌వ‌హార్ రెడ్డిని నియ‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. జ‌వ‌ర‌హార్ రెడ్డి అంద‌రికీ బాగా తెలిసిపోయిన వ్య‌క్తే. ఎందుకంటే క‌రోనా విజృంభిస్తున్న కాలంలో ఆయ‌న అంద‌రికీ ప‌రిచ‌య‌మైపోయారు. రాష్ట్రంలో క‌రోనా నివార‌ణ‌కు ఆయ‌న తీసుకుంటున్న చ‌ర్య‌లు సైతం రాష్ట్రంలో రిక‌వ‌రీ రేటు పెరిగేందుకు ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని అంతా అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు సీఎం జ‌గ‌న్ ఆయ‌న్ను టిటిడి ఈవోగా పంపించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. మొత్తానికి అన్నింటిలో ప్రక్షాళ‌న చేసి ది బెస్ట్‌గా చేస్తున్న సీఎం టిటిడిపై కూడా ఈ త‌ర‌హాలోనే డెవ‌ల‌ప్‌మెంట్ చేయొచ్చ‌ని వినికిడి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here