కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టిన జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్రరాష్ట్రంలో సంచలనాలు సృష్టిస్తోంది. వైసిపి అధినేత జగన్ ఎప్పుడైతే పాదయాత్ర మొదలు పెట్టాడో ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలో కి అడుగుపెట్టింది. నేడు జిల్లాలో జగన్ పాదయాత్ర చాలా విజయవంతంగా జరిగింది. జగన్ కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టగానే..జగన్ కు జనం బ్రహ్మరధం పట్టారు.కనక దుర్గ వారధి వద్ద జనం పోటెత్తారు.ఈ క్రమంలో జగన్ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించగానే టీడీపీ సీనియర్ నేత యలమంచలిరవి పార్టీలోచేరారు .
జగన్ పాదయాత్ర కనకదుర్గమ్మ వారధికి చేరుకోగానే పెద్దయెత్తున తన అనుచరులతో వచ్చిన రవి జగన్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీలోకి జగన్ కండువా కప్పి యలమంచలి రవికి స్వాగతం పలికారు. జగన్ కృష్ణాజిల్లాలో అడుగుపెట్టడంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడుపడటంలేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ పాదయాత్రలో గొడవలు సృష్టించాలని వ్యూహాలు పన్నుతున్నారు. ఏదిఏమైనా జగన్ పాదయాత్రకు జనాలు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here