జగన్ పై మండిపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు వైసిపి అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికార దాహం కోసం చేస్తున్న పాదయాత్ర ను ప్రజలు ఎవరూ నమ్మడం లేదని అన్నారు. ప్రజాసమస్యలు అంటూ చేపట్టిన పాదయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు తప్ప మరేమీ లేవు అని అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జ‌గ‌న్ త‌ల కింద‌పెట్టి.. కాళ్లుపైకి పెట్టినా 2019లో సీఎం కాలేర‌ని విమ‌ర్శించారు. నిజాయితీకి నిలువుట‌ద్దం అయిన సీఎం చంద్ర‌బాబుపై వైఎస్ జ‌గ‌న్ లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌న‌ను బాధించాయ‌ని, వైఎస్ జ‌గ‌న్‌కు త‌న తండ్రి, తాత‌లాగే క్రిమిన‌ల్ ఆలోచ‌న‌లే వ‌స్తున్నాయ‌ని ఎద్దేవ చేశారు.
టీడీపీలో ఎవ‌రైనా అవినీతికి పాల్ప‌డితే.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుని, అటువంటి వారిని టీడీపీ నుంచి స‌స్పెండ్ చేస్తార‌ని, కానీ జ‌గ‌న్ మాత్రం త‌న వైసీపీ పార్టీలో నేర‌స్థుల‌ను చేర్చుకుంటూ.. ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు పంపుతున్నార‌న్నారు మంత్రి అచ్చెన్నాయుడు. జైల్లో ఉండాల్సిన ఖైదీ బయట రాష్ట్రంలో ఇలా తిరిగితే రాష్ట్రపతి ఇలాగే ఉంటుందని తీవ్రంగా తప్పుబట్టారు. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా వైసిపి ఓడిపోతుందని తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది అన్నారు. అప్పుడు జగన్ చేసిన మోసాలను బయటకు తవ్వి జగన్ ని కటకటాల పాలు చేస్తామని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here