రామానాయుడు స్టూడియో పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి

తెలుగు ఇండస్ట్రీ పెద్దలను, దర్శకులను, నిర్మాతలను కంగారు పెట్టిస్తున్న నటి శ్రీరెడ్డి. తాజాగా ఇటీవల రామానాయుడు స్టూడియో అధినేత దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ తనతో శారీరకంగా కలిసినప్పుడు దిగిన ఫోటోలను బయటపెట్టి ఇండస్ట్రీ లో రచ్చ రచ్చ చేసింది  శ్రీరెడ్డి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి అవకాశాలు ఇప్పిస్తామని ఇండస్ట్రీలో ఉంటూ మోసం చేసే ఇటువంటి వైఖరి కలిగిన అభిరామ్ లాంటి వ్యక్తులకు శిక్ష నిర్భయ చట్టం కింద కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేసింది.
అంతేకాకుండా రామానాయుడు స్టూడియోలో వందల మంది ఆడపిల్లల మానాలు నలిగిపోతున్నాయని, తక్షణం వాళ్ల నుంచి విముక్తి కలిగించాలని పేర్కొంది. అమ్మాయిల ఫీలింగ్స్ తో ఆడుకొనే ఎవడినీ వదిలేది లేదని, ఇక ముందు ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోవాలన్నా భయపడాలని.. తాను చేస్తున్న ఉద్యమానికి మరకలు అంటించేవాళ్లకి ఇదే తన సవాల్ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here