ఆస్కార్ వెళ్లాల్సిన సినిమా రంగస్థలం: పవన్ కళ్యాణ్

రంగస్థలం విజయోత్సవ వేడుక హైదరాబాద్ నగరంలో అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకొంది. రంగస్థలం సినిమాలో చరణ్ నటించిన నటన చాలా అద్భుతంగా ఉందని తాను బాగా భావోద్వేగానికి లోనయ్యాను అని అన్నారు. సిటీల్లో పెరిగిన చరణ్ పల్లెటూరి వాతావరణంలో చిట్టిబాబు గా పోషించిన పాత్ర అమోఘమని అన్నారు.
ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ బరిలోకి వెళ్లాల్సిన సినిమా అని ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్  అన్నారు.భారతదేశం తరపున ‘ఆస్కార్’ పోటీలకు వెళ్లాల్సిన సినిమా ఇదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా నుంచి ఎలాంటి అండదండలు కావాలన్నా ఉంటాయి. ఇలాంటి గొప్ప కథను ఇచ్చినందుకు దర్శకుడు సుకుమార్ కు తెలుగుజాతి రుణపడి ఉంటుంది.
రెండేళ్ల క్రితం బాహుబలి చిత్రం కోసం అందరూ ఎలా అయితే అండగా నిలబడ్డారో, ఈ రోజున రంగస్థలం చిత్రానికి కూడా అలాగే నిలబడాలి., రాజకీయాల పరంగా. కులాల పరంగా వేరైనా కాని తెలుగు పరిశ్రమ ఎప్పటికీ ఒక్కటే అని అన్నారు పవన్ కళ్యాణ్. రామ్ చరణ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు ఇటువంటివి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేశారు పవన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here