చంద్రబాబుపై మండిపడ్డ చలసాని శ్రీనివాస్

ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియా చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని చంద్రబాబుపై చెలరేగిపోయారు. మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం అన్యాయంగా విభజిస్తే చంద్రబాబు అప్పులు చేసి మరీ దిగజార్చారు అని అన్నారు. చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసం ప్రత్యేక హోదాన్ని నీరుగార్చారు. రాజకీయాల భం కోసం పుష్కరాల సమయంలో 29 మందిని బలి తీసుకున్నారు అని పెద్ద పెద్ద మాటలు అన్నారు. ఆ ఘ‌ట‌న‌కు కార‌కులైన వారి పేర్ల‌ను ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త సీఎం చంద్ర‌బాబుపై ఉంద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో.. ప్ర‌త్యేక హోదా పోరాటంలో చంద్ర‌బాబుకు ఎన్ని మార్కులు వేస్తారు అంటూ యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు చ‌ల‌సాని శ్రీ‌నివాస్ స్పందిస్తూ.. అస‌లు చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాపై పోరాటం చేస్తేనే క‌దా..!! మార్కులు వేయ‌డానికి అంటూ ఎద్దేవ చేశారు చ‌ల‌సాని. ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబుది త‌త్త‌ర.. బిత్త‌ర పోరాటం.. అతినిక అస‌లు మార్కులే లేవ‌న్నారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైసీపీ పార్టీ అని అన్నారు.. తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక హోదా విషయంలో చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చేది అని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని బలంగా నమ్మడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా విషయంలో దొంగనాటకాలు ఆడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు చలసాని శ్రీనివాస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here