ఇతర భాషలలోకి ‘రంగస్థలం’ సినిమా

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ‘రంగస్థలం’ సినిమా అనేక సంచలనాలు సృష్టిస్తుంది. మగధీర తరహాలో రామ్ చరణ్ భారీ హిట్టు కొట్టడం తో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా అన్ని రంగాల ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. చిట్టిబాబు గా రామ్ చరణ్ కథ అద్భుతంగా ఉంది అని చాలా మంది ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా అంటున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 103 కోట్ల షేర్ ను సాధించింది. తెలుగులో అత్యంత వేగంగా .. అత్యధికంగా వసూళ్లను రాబట్టిన 3వ చిత్రంగా నిలిచింది.
తెలుగులో ఈ సినిమాకి లభిస్తోన్న ఆదరణ కారణంగా తమిళంలోను ఈ సినిమాను అనువదించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే మిగతా భాషల్లో కూడా అనుమతించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఈ సినిమాను బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ అగ్ర హీరో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. మరి ఈ సినిమా హిందీలో అనువదిస్తారు లేకపోతే సినిమా హక్కులను అమ్ముతారో  చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here