హీరో రానా.. తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి: శ్రీరెడ్డి

టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గొడవ రోజురోజుకీ పెద్దదవుతుంది. గతంలో మా అసోసియేషన్ చాంబర్ ముందు బట్టలు విప్పి నిరసన తెలిపి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి…ఇటీవల తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానల్ లైవ్ లో ఇండస్ట్రీలో పెద్దగా వ్యవహరించే దగ్గుబాటి సురేష్బాబు రెండవ కుమారుడు దగ్గుబాటి అభిరామ్ తనతో కలిసి దిగిన ఫోటోలను బయటపెట్టి  ఇండస్ట్రీ పెద్దల కు షాక్ గురిచేసింది. దీంతో శ్రీ రెడ్డికి పబ్లిక్ లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో స్టూడెంట్ జేఏసీ ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా చేపట్టి తొలిగా అగ్ర‌నిర్మాత డి.సురేష్‌బాబు త‌న‌యుడు అభిరామ్‌పై నిర్భ‌య కేసు పెట్టేందుకు విద్యార్థి సంఘాలు రెడీ అవుతున్నాయి..అలాగే ప‌నిలో ప‌నిగా నాని, కోన‌, కొర‌టాల‌పైనా కేసులు న‌మోదు చేస్తార‌ట‌. మొత్తానికి శ్రీరెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని గడగడలాడిస్తోంది అని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here