శ్రీ రెడ్డి దెబ్బకు దిగివచ్చిన ‘మా’ అసోసియేషన్ సభ్యులు

తెలుగు సినిమా రంగంపై హీరోయిన్  శ్రీ రెడ్డి అసభ్యకరమైన పదజాలంతో ఇండస్ట్రీ పెద్దలను అవమానించిన నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శ్రీరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీంతో శ్రీరెడ్డి తన బాధను పలు మీడియా చానల్ వేదికగా అందరికీ తెలియజేసింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉన్న హీరో నాని,కొరటాల శివ, రైటర్ కోన వెంకట్, వైవా హర్ష ఇలా పలువురి పేర్లు బయటపెట్టి  ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అయితే అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ మద్దతుకోరిన ఆమె అభ్యర్ధనమేరకు నేడు ఓయూ జేఏసీ మా అసోసియేషన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించింది.
దీంతో మా అసోసియేషన్ సభ్యులు శ్రీ రెడ్డి ఓయూ జేఏసీ విద్యార్థులు చేసిన నిరసనలతో దిగివచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి పై నిషేధాన్ని ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ. అంతేకాకుండా ఇండస్ట్రీకి అవకాశాల కోసం వస్తున్నా అమ్మాయిలకు రక్షణ కల్పించడానికి కొత్త కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే మరోపక్క హీరోయిన్ శ్రీరెడ్డి ఇండస్ట్రీ పెద్దలను  వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here