రాజధాని తరలింపుకు ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్..!

తాజాగా పాలనా రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ముఖ్యంగా విశాఖకు పాలనా రాజధానిని తరలిస్తారనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు అడుగులు పడలేదు.. కోర్టులో పిటిషన్లు, కరోనా వ్యాప్తి.. ఇలా ఎప్పుడూ ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది. అయితే తాజాగా పాలనా రాజధాని తరలింపుపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

విశాఖకు పాలనా రాజధాని తరలింపుపై ప్రభుత్వం వరుసగా సంకేతాలు ఇస్తోంది. గత నెలలో సీఎంవో బాధ్యతలు చూస్తున్న ప్రవీణ్ ప్రకాష్ పర్యటన, తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యనతో మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. సవాంగ్ కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే విశాఖ రావడానికి సిద్ధమని తేల్చి చెప్పారు. డీజీపీ వ్యాఖ్యలు కూడా రాజధాని తరలింపుకు సంకేతాలుగా భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

ఈ నెల మూడవ వారంలో ఏపీ కేబినెట్ సమావేశం ఉంది. ఈ భేటీలో విశాఖను పాలనా రాజధానిగా చేసే అంశంపై మరోసారి చర్చిస్తారని సమాచారం. రూట్ మ్యాప్‌తో పాటూ తరలింపు అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటారనే తెలుస్తోంది. ప్రభుత్వం అంతా అనుకుంటున్నట్లుగానే జరిగితే.. అక్టోబర్ 25 విజయదశమి రోజు విశాఖ నుంచి ముఖ్యమంత్రి జగన్ పాలన చేయడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. పరిస్థితులు మొత్తం అనుకూలించి.. ఎలాంటి ఇబ్బందులు లేకపోతే అక్టోబర్‌లో విశాఖను పాలనా రాజధానిగా చూడబోతున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here