తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్ట్ చురకలు

తెలంగాణలో ఆన్లైన్ తరగతుల నిర్వహణపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. దాంతో పర్మిషన్ లేకుండా ఆన్లైన్ తరగతులను ఎలా నిర్వహిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. తరగతులు నిర్వహిస్తున్న సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని నిలదీసింది.

దాంతో కేంద్ర ప్రభుత్వం సి.బి.ఎస్.సి. నిబంధనల ప్రకారం కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయని ఏజీ వివరించారు. అయితే ఇప్పుడు చెప్పేది అంతా  ఆల్టర్నేట్ క్యాలెండర్ బోధనే నని .. ఈ నెల 7 న సిలబస్ రెడ్యూస్ చేస్తూ cbse సర్క్యులర్ జారీ చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్ట్ దృష్టికి తీసుకువచ్చారు. మరి ఇప్పటి వరకు cbse స్కూల్స్ బోధిస్తుంది  అంతా  వృధానే కదా అని కోర్ట్ ప్రశ్నించింది. దాంతో  ఆన్లైన్ తరగతుల నిర్వహణపై కమిటీ వేశామని సమగ్ర విధానాన్ని రూపొందించి హైకోర్టుకు నివేదిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక ఈ కేసును ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు ఆన్లైన్ తరగతులపై పూర్తి నివేదికను రూపొందించి సమర్పించాలని ప్రభుత్వానికి తెలిపింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here