వైయస్ జగన్ కి మంచి రోజులు వస్తున్నట్లు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ కి మంచి రోజులు వస్తున్నట్లు ఉన్నాయి. ఇటీవల ఓ ప్రముఖ  జాతీయ మీడియా ఛానల్ నిర్వహించిన సర్వేల్లో వైయస్ఆర్ సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశగా ఫలితాలు రావడం విశేషం. అయితే తాజాగా మరొక విషయమేమిటంటే అప్పట్లో వైఎస్ జగన్ మిద ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,టీడీపీ నేతలు కుట్రలు పన్ని పలు అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే.ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టివేయబడుతున్నాయి.

తాజాగా ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అధిత్యనాథ్ పై సీబీఐ మోపిన అక్రమకేసును ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కొట్టేసింది. గతంలో జగన్ కి సహకరించారు అక్రమంగా సంపాదించడానికి ప్రభుత్వ పరంగా అన్ని అధిత్యనాథ్ పై ఈడీ పలు కేసులను నమోదు చేసింది. అయితే ఈ కేసు విచారించిన అనంతరం ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఐఏఎస్ అధికారి అయిన అధిత్యనాథ్ పై వేసిన కేసులన్నీ అక్రమ కేసులు అని హైకోర్టు తేల్చేసింది.

వైయస్ జగన్ మీద మోపిన కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టేయడంతో వైసీపీ పార్టీలో ఆనందం నెలకొంది. అంతేగాకుండా జగన్ మీద వున్న మిగితా  కేసులు కూడా అక్రమంగా బనాయించినవే అని అంటున్నారు వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు. తమ నాయకుడు కేసులన్నింటిలో నుండి కడిగిన ముత్యంలా  బయటకు వస్తారని తమ ధిమ వ్యక్తం చేశారు వైయస్ఆర్ సీపీ నాయకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here