మోహన్ బాబు గారి దగ్గర ఎంతో నేర్చుకున్నాను ‘గాయత్రి’ డైరెక్టర్

చాలాకాలం తర్వాత టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్ర లో గాయత్రీ సినిమాలో నటిస్తున్నాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకటి పాజిటివ్ రోల్ అయితే మరొకటి నెగటివ్ రోల్ అట. అంతేకాకుండా ఈ సినిమాలో మంచు విష్ణు కూడా నటిస్తున్నారు. మంచు విష్ణు జోడీగా హీరోయిన్ శ్రీయ నటిస్తుంది కథలో కీలకమైన సన్నివేశం వీరిద్దరి మధ్య చోటుచేసుకుంటున్నట్లు సమాచారం.

మంచు విష్ణు ఇందులో కుర్రతనంలో మోహన్ బాబు రోల్ పోషిస్తున్నాడు అని సినిమా యూనిట్ చెబుతుంది. ఈ సినిమా దర్శకుడు మదన్ మాట్లాడుతూ .. “తండ్రీ కూతుళ్ల మధ్య చోటుచేసుకునే బలమైన కథా కథనాలతో ఈ సినిమా కొనసాగుతుందని చెప్పారు. ఒకేఒక సిటింగ్ లో మోహన్ బాబు ఈ కథను ఓకే చేశారు. ఆయన ఎంతటి గొప్ప నటుడనే విషయం ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకోవడానికి అవకాశం లభించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనతో కలిసి పనిచేసినందుకు నాకెంతో గర్వంగా వుంది” అని అన్నారు. గాయత్రి సినిమాను ఈనెల తొమ్మిదవ తేదీన  భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here