సెన్సార్ సర్టిఫికేట్ తీసుకున్న తొలిప్రేమ

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది. ఫిదా సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన వరుణ్ తేజ్. ఈసారి తొలిప్రేమతో మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని ఆతృతగా వున్నాడు. అయితే ఈ సినిమా ఈనెల 10వ తేదిన విడుదల చేస్తున్న నేపథ్యంలో తొలిప్రేమ సినిమా సెన్సార్ కి వెళ్లింది. అయితే ఈ సందర్భంగా సెన్సార్ బోర్డ్ తల్లిప్రేమ సినిమాకి యు /ఎ సర్టిఫికేట్ ను అందించింది.

తొలిప్రేమ సినిమా వరుణ్ తేజ్ జోడీగా రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది.ఈ ట్రైలర్ లో వరుణ్ తేజ్ రాశి ఖన్నా ఇద్దరూ కూడా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. డైలాగ్స్ పరంగా సంగీతం పరంగా ఫోటోగ్రఫీ పరంగా ఈ ట్రైలర్ కి మంచి మార్కులు పడిపోయాయి. విడుదలైన ట్రైలర్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

ట్రైలర్ బట్టి ఈ సినిమా మంచి ఫీల్ లవ్ ఎమోషన్ తో చిత్రీకరించినట్లు తెలుస్తుంది. మరోసారి ప్రేమను నమ్ముకున్న వరుణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొడతాడో లేదో చూడాలి. వెంకి అట్లూరి తొలిప్రేమ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు, తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here