రకుల్ ప్రీత్ సింగ్ ని వెన్నెల కిషోర్ ని ఆశ్చర్యపరిచిన అమితాబ్ బచ్చన్

ప్రధాని మోదీ తర్వాత భారతదేశంలో అత్యధికంగా సెక్టర్ ఫాలోవర్స్ లో రెండో స్థానంలో ఉన్నాడు బాలీవుడ్ బిగ్ బీ. బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ చాలామంది ఫాలో అవుతూ ఉండడంలో పెద్ద విశేషమేమీ లేదు. అయితే ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ టాలీవుడ్ కి  చెందిన రకుల్ ప్రీత్ సింగ్, హాస్య నటుడు వెన్నెల కిశోర్‌లను ఫాలో అవ్వుతూ ఆశ్చర్యానికి గురిచేశారు. ట్విటర్ లో అమితాబ్ బచ్చన్ తమను ఫాలో అవుతున్నారని తెలుసుకున్న ఈ ఇద్దరు నటులు తమ తమ ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు, వెన్నెల కిశోర్ అయితే నాగుండె దడ దడ అని కొట్టుకుంటుందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, అమితాబ్ బచ్చన్ మరికొందరు టాలీవుడ్ నటులను కూడా ఫాలో అవుతున్నట్లు సమాచారం. వారు కూడా ఎవరో బయటపడితే కొద్దిగా క్లారిటీ వస్తుంది అమితాబచ్చన్ టాలీవుడ్ నటులను ట్విట్టర్ లో ఎంతమంది ఫాల్లో అయ్యడో.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here