నటుడు ప్రకాష్ రాజ్ రాసిన పుస్తకం

తనకు ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయే నటుడు ప్రకాష్ రాజ్. టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్ తాజాగా తన మాతృభాషలో ఒక పుస్తకాన్ని రాశాడు.ఆ పుస్తకం పేరు ‘ఇరువుదెల్లవ బిట్టు’ ఈ పుస్తకం ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు నవకర్ణాటక ఆన్ లైన్ వెబ్ సైట్, అమెజాన్‌, ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉంచుతున్నానని చెప్పారు. ఈ పుస్తకాన్ని అందరూ కొనుగోలు చేయండని కోరారు.

కాగా, కొన్ని నెలలుగా బీజేపీపై మండిపడుతోన్న ప్రకాశ్ రాజ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చాలా సార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆయనపై పలు సార్లు బీజేపీ నేతలు కూడా మండిపడ్డారు. అంతేకాకుండా ఈ పుస్తకం లో తన వ్యక్తిగత జీవితం యొక్క అనుభవాలను, మరియు సమాజం నుండి నేర్చుకొన ఎన్నో విలువైన పాఠాలను ఇందులో పొందుపరిచానని తెలిపాడు. అయితే మొన్నటి దాకా కేంద్రం ప్రభుత్వం మీద బీజేపీ మీద మండిపడిన నటుడు ప్రకాష్ రాజ్ తరుణం లో ఈ పుస్తకానికి సరికొత్త ప్రాధాన్యత సంతరించుకుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here