వచ్చేఎన్నికలలో విజయవాడ ప్రాంతం నుండి నాగార్జున పోటీ?

వైసీపీ అధినేత జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కొత్త సమీకరణలకు దారితీస్తుంది. జగన్ తలపెట్టిన పాదయాత్ర వైసిపి పార్టీకి ఎంతో మేలు చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జగన్ అడుగు వేస్తున్న ప్రతి ప్రాంతంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత స్పష్టం గా కనబడుతోంది. మొత్తమ్మీద జగన్ తలపెట్టిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.

ఇక ఈ నేప‌ధ్యంలోనే జగన్‌ని ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ ప్రశాంత్ కిషోర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అసలు విషయమేమిటంటే  హీరో నాగార్జున ని పార్టీలోకి ఆహ్వానించి 2019 లో ఓ హాట్ సీట్ నుంచి బరిలోకి దింపితే పార్టీకి మైలేజ్ హైరేంజ్‌లో వ‌స్తోంద‌ని ప్రశాంత్ కిషోర్ మదిలో మెదిలిన ఆలోచన. పైగా హీరో నాగార్జునకు వైయస్ కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధం ఉంది.

గత ఎన్నికల్లోనే నాగార్జున రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ సందర్భంగా పీకే టీమ్ నాగార్జునని అప్రోచ్ అయ్యారని రాజకీయ వర్గాల్లో వినికిడి. ఒకవేళ నాగార్జున వైసీపీ లోకి వస్తే విజయవాడ నుండి పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఈ నేపథ్యంలో నాగార్జున రావడం వల్ల కృష్ణ జిల్లా లో వైసీపీ పార్టీకి మేలు జరుగుతుందని ప్రశాంతి కిషోర్ ఆలోచిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here