2 లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బీజేపీ పార్టీల మైత్రి బంధం క్రమ క్రమ బలహీనపడుతూ వస్తుంది. ఈ పరిస్థితిని గల కారణం అనేక కారణాలు మొన్న పోలవరం విషయమైతే, తాజాగా కేంద్రం ప్రకటించిన బడ్జెట్ విషయంతో రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది అలాగే ఒకరి మీద ఒకరు రెండు పార్టీలకు చెందిన నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకునే దాకా వచ్చింది.ప్రస్తుత టిడిపి బిజెపి పార్టీ పరిస్థితి రెండు పార్టీల మధ్య గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది.

ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అవినీతి అక్రమాలను బయటపెట్టుకుంటున్నారు.బిజెపి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మిద సంచలనాత్మక విషయాలను బయటపెట్టాడు. సోము వీర్రాజు  మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి  కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్న కానీ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారు.

ఏపీకి ముప్పై వేల కోట్ల రూపాయలను ఉపాధి హామీ పథకం కింద ఇచ్చాం. కేంద్రం ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ నేతలు ఇష్టం వచ్చినట్లుగా దండుకొని తన ఆస్తులను పెంచుకున్నారు.అయిన రెండు ఎకరాల ఆసామి అయిన చంద్రబాబు రెండు లక్షల కోట్లను ఎలా సంపాదించాడో అందరికి తెల్సిందే.పిల్లనిచ్చి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కి రాష్ట్ర ప్రజలు ఒక లెక్కా  అంటూ ఘాటైన తీవ్రమైన విమర్శలు చేశారు సోమువీర్రాజు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here