కొరటాల మహేష్ సినిమా మార్పు చేర్పులు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భారత్ అనే నేను సినిమా చేస్తున్నాడని మనకందరికీ తెలుసు. అయితే ఈ సినిమా కాపీ అని ఈ మధ్య వార్తలు రావడంతో దర్శకుడు కొరటాల శివ ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు.అయితే ఇటీవల విడుదలైన ఒక సినిమాకు ఈ కథకు అక్కడక్కడా పోలికలు వున్నట్టుగా గుసగుసలు వినిపిస్తూ ఉండటంతో, మార్పులు, చేర్పులకు కొరటాల సిద్ధమైపోయారట.ఇపటిదాక చిత్రీకరించిన సన్నివేశాలు మీద తర్వాత చిత్రీకరించబోయే సన్నివేశాల మీద హీరో మహేష్ బాబుతో డైరెక్టర్ కొరటాల శివ చర్చలు జరిపారు అని సమచారం.

ఈ చర్చలో భాగంగా ఎడిటర్ శ్రీకర ప్రసాద్ ను కూడా పిలిపించారట. ఆయనతో కలిసి కూర్చుని చేయవలసిన మార్పులు  చేర్పులను ఖరారు చేసుకున్నారట.ఇప్పటికే రెండు ప్లాపులతో మునుగుతున్న మహేష్ బాబు, ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. అయితే ఇటీవలే ఈ సినిమా కథ గురించి తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల. మరొకసారి సినిమా మొత్తం పరిశీలన చేసుకున్నాడంట ఎక్కడైనా కాపీ అనేది ఉందేమో అని. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో మహేష్ బాబుతో పాటు కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here