రోడ్డెక్కి నందుకు హీరోయిన్ అమలాపాల్ ను అభినందించిన తమిళ ఇండస్ట్రీ

తన అందచందాలతో కుర్రకారును పిచ్చెక్కించే హీరోయిన్ అమలాపాల్ వరుస వివాదాలతో వార్తల్లో ప్రధానంగా నిలుస్తుంది. కొన్న కారు వివాదంలో కోర్టు మెట్లు ఎక్కి విషయం అరెస్టు అయ్యేదాకా రావడంతో ముందస్తు బెయిల్ సంపాదించుకుని బయటపడిన అమలాపాల్. తర్వాత అమలా పాల్ లైంగిక వేదింపులకు గురైనది.ఈ క్రమంలో  చెన్నై కి సంబంధించిన ఓ ప్రముఖ వ్యాపారి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇవ్వడం జరిగింది హీరోయిన్ అమలాపాల్.

అయితే ఈ సందర్భంగా చెన్నై రాష్ట్రానికి సంబంధించిన నడిగర్ సంఘం హీరోయిన్ అమలాపాల్ ను అభినందించింది. అమలాపాల్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఆమె ధైర్యానికి ఓ ప్రకటన విడుదల చేసింది నడిగర్ సంఘం. లైంగిక వేధింపుల గురించి పలువురు నటీమణులు బయటకు మాట్లాడేందుకు వెనకాడుతున్న తరుణలో తనకు జరిగిన వేధింపులపై అమలాపాల్‌ ధైర్యంగా ముందుకురావడం అభినందనీయమని తెలిపింది. హీరోయిన్ అమలాపాల్ కంప్లైంట్ పరిగణనలోకి తీసుకొని ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్లు దర్యాప్తు చేపట్టి నిందితుడి ని అరెస్టు చేసి. అతని మీద కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం పోలీస్ శాఖకు కూడా కృతజ్ఞతలు తెలిపింది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here