గడ్డకట్టించే చలిలో షూటింగ్ చేస్తున్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న ‘నాపేరు సూర్య నాఇల్లు ఇండియా’సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పక్కా ప్రణాళికలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వక్కంతం వంశీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్ మధ్యలో ఉండే మంచుకొండల నడుమ షూటింగ్ జరుపుకుంటోంది.చాలా తీవ్రమైన చలి ఉష్ణోగ్రతల మధ్య అల్లు అర్జున్ నటిస్తున్నాడు. మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ లో  గడ్డకట్టించే చలిలో అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించవని యూనిట్ కి ముందే తెలుసట.అయితే ఈ క్రమంలో సినిమా యూనిట్ హైదరాబాదులో సెట్ వేసి షూటింగ్ చేద్దామని అనుకున్నారు కానీ హీరో బన్నీ అలా చేయడం వలన అనుకున్న ఎఫెక్ట్ రాదనీ, కష్టమైనా సహజంగా ఉండేలా చేద్దామని బన్నీ పట్టుపట్టాడట. దాంతో అక్కడే చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ మంచు కొండల మధ్య చిత్రీకరిస్తున్న సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా  నిలవనున్నాయి అంటున్నారు సినిమా యూనిట్.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంది, అంతేకాకుండా ఇటీవల సినిమాకి సంబంధించి విడుదల చేసిన పాట కూడా  ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను ఈ నెల 14వ తేదీన వదలనున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here