కెసిఆర్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం తో గుత్తా లైఫ్ మొత్తం మారిపోబోతోంది

 కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్ తెరాస అధినేత కెసిఆర్ మీద అప్పట్లో పోరాటం చేసీ చేసీ నెమ్మదిగా అదే గూటికి జేరి గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయన్ని మంత్రివర్గం లోకి తీసుకుంటారు అని కార్పరేషన్ చైర్మన్ ని అయినా చేస్తారు అంటూ అప్పట్లో చాలానే వార్తలు వినపడ్డాయి. చివరికి రైతు సమన్వయ కమిటీ సమితి కి చైర్మన్ గా చేయనున్నారు అంటూ తెరాస వర్గాలు దాదాపు ప్రకటించాయి. కానీ వీటిల్లో ఏ విషయాల్లో స్పష్టత రాకపోవడం తో ఇన్నాళ్ళూ ఆయన నిరీక్షిస్తూ నే ఉన్నారు. గులాబీ దళపతి కెసిఆర్ గుత్తా కి సంబంధించి ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు అనీ అది ఆయన లైఫ్ నే మార్చబోతోంది అనీ అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.

రైతు సమన్వయ కమిటీ పేరుతో తన కళల ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరొక కొత్త నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్ర స్థాయి లో ఏర్పాటు కాబోతున్న రైతు సమన్వయ కమిటీ – సమితి కి కార్పరేషన్ రాబోతోంది. దానికి ఒక ఉన్నతాధికారిని నియమించే అవకాశముందన్నారు. సహజంగానే కార్పొరేషన్ కు అధికారితో పాటు చైర్మన్ ఉంటారు. ఆ చాన్స్ గుత్తాకే దక్కవచ్చని అంటున్నారు. దీంతో గుత్తా నిరీక్షణకు తెరపడుతుందని విశ్లేషిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచీ మండల స్థాయి వరకూ రైతు సమన్వయ సమితులకి తోడుగా జిల్లా కమిటీలు ఏర్పాటు అవుతాయి .. వీటికి జిల్లాల యొక్క మంత్రులు దగ్గరుండి కథ నడిపించాలి. ఇది కెసిఆర్ ఆదేశం కూడా.

జిల్లా సమన్వయ సమితుల ఏర్పాటు తర్వాత గ్రామ – మండల – జిల్లాస్థాయి సమితులతో రాష్ట్రంలో నలుదిక్కులా నాలుగు ప్రదేశాలలో సదస్సులను నిర్వహించాలని సూచించారు.  ఆహార కల్తీ నిరోధానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ని ప్రోత్సహించడం తో పాటు పంటల మద్దతు ధర సాధనకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది గుతా నిర్ణయించాల్సి ఉంది. ఈ దెబ్బతో మాస్ జనాల్లో , రైతుల్లో గుత్తా కి ఫుల్ క్రేజ్ రాబోతోంది అనీ సరిగ్గా వాడుకుంటే ఆయన లైఫ్ ఏ మారిపో బోతోంది అనీ అంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here