నా దృష్టిలో బాహుబలి కంటే దంగల్ మంచి సినిమా : నటుడు భానుచందర్

ప్రముఖ సీనియర్ నటుడు భానుచందర్ ని  ఇటీవల ఐ డ్రీమ్స్ వారు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాహుబలి సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ఆయనా జవాబివ్వడానికి కొద్దిగా ఇబ్బందిపడ్డరు. ఆ తర్వాత స్పందిస్తూ” మంచి సినిమాలు వేరు పాపులర్ సినిమాలు వేరు” అని భానుచందర్ అన్నారు. అంతేకాకుండా భానుచందర్ ఇంకా మాట్లాడుతూ  ‘బాహుబలి’ హాలీవుడ్ స్థాయి సినిమా అని ఏ హాలీవుడ్ దర్శకుడు అన్నాడు? ఏ హాలీవుడ్ టెక్నీషియన్ అన్నాడు?” అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు.

‘బాహుబలి’ సినిమా గ్రేట్ ఎంటర్టైనర్ .. మోస్ట్ పాప్యులర్ ఫిల్మ్ అని మాత్రమే చెప్పొచ్చు. బాహుబలి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది.నా దృష్టిలో మంచి సినిమా అంటే ‘దంగల్. బాహుబలి కేవలం మోస్ట్ పాప్యులర్  సినిమా మాత్రమే. బాహుబలి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక స్థాయికి తీసుకెళ్లేడు దర్శకుడు రాజమౌళి. ఆ విషయంలో ఆయనకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.”మంచి సినిమాలు వేరు పాప్యులర్ సినిమాలు వేరు” అని భానుచందర్ అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here