ఎన్నికల బరిలోకి దిగుతున్న బాలకృష్ణ చిరంజీవి

గత సంవత్సరం సంక్రాంతి నాడు చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా తో పునరాగమనం చేసారు. అయితే ఆ సమయంలో చిరంజీవి 150 సినిమా తో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలవ్వడం జరిగింది. ఈ క్రమంలో రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డాయి. చిరంజీవి 150 సినిమా తర్వాత ఇప్పటివరకు ఎ సినిమా రాలేదు. బాలకృష్ణ మాత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత రెండు సినిమాలు దింపాడు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ కెరీర్లో అతి ప్రతిష్టాత్మకమైన సినిమాలు చేస్తున్నారు.

బాలకృష్ణ తన తండ్రి ఎన్టీరామారావు జీవిత కథ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా అయితే. చిరంజీవి స్వతంత్ర సమర యోధులు ఉయ్యాలావాడ నరసింహా రెడ్డి జీవిత గాధ సైరా సినిమా చేస్తున్నారు. 2019 వచ్చే వేసవి కాలంలో ఎన్నికలు కనుక బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను ఎలక్షన్ టైంలో తీసుకురావాలి అని ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి నటించిన సైరా కూడా 2019 వేసవిలో విడుదుల కానుంది. ఎన్నికలు కూడా వేసవిలోనే జరగనుండడంతో బాలయ్య, చిరు మధ్య మరో ఆసక్తికరమైన పోరు తప్పదనే ప్రచారం ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. చిరంజీవి బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ అంటే ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here