పవన్ కళ్యాణ్ నిర్మాతగా హీరో నితిన్ సినిమా విశేషాలు

నితిన్ హీరోగా తన కెరీర్లో చేస్తున్న 25వ సినిమా విశేషాలు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మొన్నటివరకు వరుసపెట్టి సినిమాలు చేసిన హీరో నితిన్ వాటి ఫలితాలు బెడిసికొట్టడంతో ఇప్పుడు స్లో అండ్ స్టడీ అన్నట్టుగా తన కెరీర్ ను  తీసుకెళుతున్నాడు ముందుకి నితిన్. ఈ క్రమంలో పక్కా ప్రణాళికలతో అడుగులు వేస్తున్నాడు నితిన్. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు సంయుక్తంగా నితిన్ 25వ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ మరియు చిత్ర విడుదల తేదీ వివరాలన్నింటినీ ఎలాంటి తడబాటు లేకుండా సినిమాకు సంబందించిన అన్ని తేదీల్ని నితిన్ తన ట్విట్టర్ లో ప్రకటించాడు.చిత్ర ఫస్ట్ లుక్ ని ఈనెల 12న, టీజర్ 14 న మరియు చిత్రాన్ని ఏప్రిల్ 5 న విడుదల చేయనున్నట్లు నితిన్ ప్రకటించాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడు రౌడీ ఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య. మరియు ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు తమన్. నితిన్తో పాటు హీరోయిన్ గా  మేఘా ఆకాష్ నటించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here