రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొస్తాం: జగన్

జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలో అనేక సంచలనాలు సృష్టిస్తుంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో సాగుతోంది. జిల్లాలో జగన్ పర్యటించిన ప్రతీచోట జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా జగన్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ‘జగన్‌ స్పీక్స్‌’ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో జగన్ ఏమన్నారంటే…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ప్రత్యేక హోదా రావాలి అలాగే చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించాలి అని అన్నారు. మరిముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలి అని రాష్ట్రంలో చదువుల విప్లవం రావాలని జగన్ అన్నారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. సాంకేతిక విద్యకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముష్టి వేస్తుందని, ఉత్తమ విద్యను అందించే కళాశాల్లో ఫీజులు రూ. లక్ష వరకూ ఉంటున్నాయని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా సరైన సమయానికి అందటం లేదని విద్యార్థులు వాపోతున్నారని చెప్పారు.తక్కువ ఫీజును రీయింబర్స్‌ చేస్తే తల్లిదండ్రులు ఎక్కడి నుంచి డబ్బు తెస్తారని ప్రశ్నించారు. చదువుల విప్లవాన్ని తీసుకురావాలని,చదువుకునే పిల్లవాడి అన్ని విధాలా ప్రభుత్వ సాయం ఉండాలని అని అన్నారు జగన్. అంతేకాకుండా చదువుకున్న ప్రతి పిల్లవాడి తల్లికి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూ ప్రభుత్వం అందిస్తుందని జగన్ చెప్పుకొచ్చారు.అది కచ్చితంగా విజయవంతం అవుతుందని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here