అవసరమైతే కువైట్‌ వెళ్తా: కేటీఆర్

జీవనోపాధి కోసం దేశం విడిచి అరబ్ దేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ మోసపోవడం ఆ దేశం వారు వారిని నానా హింసలు పెట్టి అక్రమ వలసదారులు గా ముద్ర వేసి జైల్లో పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. కువైట్‌లో అక్రమవలసదారులుగా ఉన్నవారికి క్షమాభిక్ష ప్రకటిస్తూ ఆ దేశం తీసుకున్న నిర్ణయాన్ని ఉపయోగించుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయకారిగా ఉంటుందని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ కేటీఆర్‌ స్పష్టం చేశారు.

కువైట్లోని తెలుగువారిని ఆదుకునేందుకు మంత్రి కేటీఆర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ పట్ల గల్ఫ్‌ తెలంగాణ వెల్ఫేర్‌&కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పట్కురి బసంత్‌ రెడ్డి సోమవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా బసంత్‌ రెడ్డి మాట్లాడుతూ కువైట్ బాధితులను మంత్రి కేటీఆర్ ఆదుకున్న తిరు ప్రశంసనీయమని, అవసరమైన మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే అక్కడ ఉన్న భారత రాయబార కార్యాలయం తో కేంద్ర విదేశాంగ శాఖ తో ఆ దేశ ప్రభుత్వం తో చేస్తున్నామని తెలిపారు కేటీఆర్…. అవసరమైతే కువైట్‌ వెళ్తానని హామీ ఇచ్చినట్లు బసంత్‌ రెడ్డి తెలిపారు.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here