దేశంలో తొలి ‘మేఘా’విద్యుత్ సరఫరా

యూపిలో ప్రారంభించిన ఏంఈఐఎల్ మేఘా ఇంజనీరింగ్.. ఇప్పుడు సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. గడిచిన 25 ఏళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడి దేశ విదేశాల్లో తన కార్యకలాపాలను విస్తరిస్తూ – మౌళిక వసుతుల నిర్మాణ రంగంలో తనదైన ముద్రవేసుకుంటు వెళ్తున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. నిర్మాణ రంగంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. తాగు – సాగు నీటి ప్రాజెక్టులు – ఎత్తిపోతల పథకాలు మొదలైన వాటిలోనే కాకుండా విద్యుత్ సరఫరా రంగంలోనూ తనదైన ప్రతిభను చాటుకుంది. ఎటువంటి ప్రాజెక్ట్ నైనా ఛాలెంజ్ గా తీసుకుని సకాలంలో అధునాతన పరిజ్ఞానం – నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయగలమని నిరూపించుకునే క్రమంలో వెస్ట్రన్ యూపి పవర్ ట్రాన్స్ మిషన్ కంపెనీ లిమిటెడ్ ద్వారా కూడా తన సత్తాను చాటుకుంది.

దేశంలోనే తొలిసారిగా అత్యంత పెద్దదైన విద్యుత్ సరఫరా (పవర్ ట్రాన్స్ మిషన్) వ్యవస్థ నిర్మాణాన్ని లక్ష్యం మేరకు పూర్తి చేసి జాతికి అంకితం చేసింది. ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దది అంటే 13220 ఎంవీఏ విద్యుత్ సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుంది. అంటే దేశంలో 29 రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పాధక సామర్థ్యంతో పోలిస్తే ఈ సరఫరా వ్యవస్థ 5వ స్థానంలో ఉంటుంది.

దేశంలో మహారాష్ట్ర – గుజరాత్ – తమిళనాడు – రాజస్థాన్ – ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ ఉత్పాధక సామర్థ్యం తరువాత ఈ ప్రాజెక్ట్ విద్యుత్ సరఫరా సామర్థ్యం ఉందంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాధక సామర్థ్యాలతో సమానంగా వెస్ట్రన్ యూపి ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ సరఫరా సామర్థ్యం ఉంది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్  మొత్తం ఈ వ్యవస్థ ద్వారా సరఫరా సాధ్యమవుతుంది.

ఉత్తరప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతంలో విద్యుత్ సరఫరా – పంపిణీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ వెస్ట్రన్ యూపి పవర్ ట్రాన్స్ మిషన్ కంపెనీ లిమిటెడ్ (డబ్ల్యూయూపిపిటిసిఎల్` WUPPTCL) అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్ పవర్ ట్రాన్స్ మిషన్ కంపెనీ లిమిటెడ్ పనులను ఎంఈఐఎల్ (MEIL) పూర్తిచేసింది. తద్వారా మేఘా సంస్థ దేశంలో విద్యుత్ సరఫరా – సబ్ స్టేషన్ల నిర్మాణం – నిర్వాహణలో ఉన్నతస్థాయి సంస్థగా అందులోనూ ప్రతిష్ఠాత్మాకమైన పవర్ గ్రిడ్ కార్పోరేషన్ లాంటి సంస్థల సరసన చేరింది.

ఈ తరహా ప్రాజెక్ట్ లు దేశంలో ఉన్నప్పటికీ అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉన్నాయి. కానీ ప్రైవేటు రంగంలో ఇంత పెద్ద స్థాయిలో ఇదే మొదటిది. ఇతరతర కంపెనీలు ప్రైవేటు రంగంలో సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికి అవి పరిమితంగా ఉన్నాయి.

వెస్ట్రన్ యూపి పవర్ ట్రాన్స్ మిషన్ కంపెనీ లిమిటెడ్ అత్యంత అధునాతన ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో సరఫరా వ్యవస్థను మేఘా ఇంజినీరింగ్ నిర్మించింది. ఇందులో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ లోనే మొట్టమొదటిసారిగా జీఐఎస్ (గ్యాస్ ఇన్ స్లేటెడ్ సబ్ స్టేషన్) నిర్మించిన ఘనత ఈ కంపెనీకే దక్కుతుంది. ఈ కొత్త విధానాన్ని దేశానికి పరిచయం చేసి అధునాతన శాస్త్రసాంకేతిక ప్రగతికి ద్వారాలు తెరిచింది.

ఈ ప్రాజెక్ట్ లో ప్రధానంగా ఏడు సబ్ స్టేషన్లు – రెండు ట్రాన్స్ మిషన్ లైన్లు ఉన్నాయి. వీటిని బూట్ పద్ధతిలో (బిల్ట్ – ఓన్ – ఆపరేట్ – ట్రాన్స్ ఫర్) నిర్మించిన మేఘా ఇంజినీరింగ్ సంస్థకు 35 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించారు. దేశంలోనే తొలిసారిగా 765 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సరఫరా వ్యవస్థను నిర్మించింది. 654 కిలోమీటర్ల పొడవైన 765/400 కేవీఏ విద్యుత్ ట్రాన్స్ మిషన్ లైన్లను నిర్మించింది. 2011 మే 31న ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన మేఘా సంస్థ లక్ష్యం మేరకు 2018 ఫిబ్రవరిలో పూర్తి చేసి వెస్ట్రన్ యూపీలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచింది.

ఈ ప్రాజెక్ట్ క్రింద పశ్చిమ యూపిలోని ప్రధానంగా పది జిల్లాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుంది. మెయిన్పురి – ఇటా – మహామాయానగర్ – ఆలీఘర్ – బుంద్షర్ – హాపూర్ – ఘజియాబాద్ – మీరట్ – గౌతమ్ బుద్ధ నగర్ – బిజినూర్ జిల్లాల్లో విద్యుత్ సరఫరా ద్వారా వెలుగులు నింపుతోంది.

7 సబ్ స్టేషన్లతో పాటు 836 సర్కూట్ కిలోమీటర్ల పొడవైన విద్యుత్ లైన్లను మేఘా నిర్మించింది. ఇందులో 765 మరియు 400 – 220 – 132 కిలోవాట్ల సింగిల్ – డబుల్ సర్కూట్ లైన్లను ఏర్పాటు చేసింది. వీటిద్వారా 13220 ఎంవీఏ విద్యుత్ సరఫరా ఆ ప్రాంతానికంతా సాధ్యమవుతుంది. ఇందులో భాగంగా 7 హైటెన్షన్ విద్యుత్ ఉప కేంద్రాలను నిర్మించింది. అవి హాపూర్ – గ్రేటర్ నోయిడా – సికిందరాబాద్ – ఇందిరాపురం – దాస్నా – నెహతౌర్ – హతౌర్ వద్ద నిర్మించింది. సరఫరా వ్యవస్థలో 765 కె.వి. ట్రాన్స్ మిషన్ లైన్లను 475 కిలోమీటర్ల మేర – 400 కెవి హైటెన్షన్ లైన్లు 358 కిలోమీటర్ల మేర నిర్మించింది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం… జీఐఎస్ దేశంలో తొలిసారిగా జీఐఎస్ (గ్యాస్ ఇన్ స్లేటెడ్ సబ్స్టేషన్లు) నిర్మించిన ఘనత మేఘాకే దక్కింది. సాధారణ పద్ధతిలో అయితే ఏఐఎఎస్ విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మిస్తారు. ఇందుకోసం ఎక్కువ స్థలం అవసరమవుతుంది. కానీ జీఐఎస్లో తక్కువ స్థలంలో అంటే సాధారణంగా కన్నా 65% తక్కువ ప్రాంతంలో ఇన్ డోర్ పద్ధతిలో నిర్మిస్తారు. దీనివల్ల ఎటువంటి కాలుష్యం ఉండదు. నిర్వాహణ సమస్యలు ఎదురుకావు. ప్రమాదాలు తక్కువ. విద్యుత్ సరఫరా – పంపిణీ వ్యవస్థ చాలా మెరుగ్గా ఉంటుంది. అయితే నిర్మాణ వ్యయం అధికంగా ఉంటుంది. అదే విధంగా జీఐఎస్ పద్ధతిలో విద్యుత్ సరఫరా చేసే లైన్లను కూడా తొలిసారిగా మేఘా ఏర్పాటు చేసింది.

జీఐఎస్ సబ్ స్టేషన్లను ఒక భవనంలో ఏర్పాటు చేసి అందులో సల్ఫర్ ఎక్సాఫ్లోరైడ్ గ్యాస్ వినియోగిత విద్యుత్ యంత్రపరికరాలను ఏర్పాటు చేశారు. 400 కె.వి – 220 కె.వి – 132 కె.వి. 33 కె.వి. జీఐఎస్ సబ్ స్టేషన్లను దేశంలో తొలిసారిగా నిర్మించిన ఘనతను సాధించుకుంది.

ప్రాజెక్ట్ లో  భాగంగా 200 మంది సాంకేతిక నిపుణులతో పాటు 2000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు పాల్గొన్నారు. తొలిసారిగా ఇంత పెద్దదైన ప్రైవేటు రంగంలోని సరఫరా వ్యవస్థ నిర్మాణంలో అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటన్నింటిని అధిగమించి పూర్తి చేయగలిగింది.  ప్రాజెక్ట్ నిర్మాణంలో అనేక సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని సకాలంలో నిర్మించటానికి అవసరమైన యంత్ర సామాగ్రిని ముఖ్యంగా ట్రాన్స్ ఫార్మర్లు – రియాక్టర్లను బీహెచ్ ఈఎల్ సరఫరా చేసింది.

నిర్మాణ సమయంలో ప్రధానంగా ఎదురైన 18 రైల్వే క్రాసింగ్లు – 17 నేషనల్ హైవేలు – 4 నదులు – 88 పవర్ లైన్ల క్రాసింగ్ లను  సమయం తీసుకున్నా సులభంగానే అధిగమించగలిగింది. అటవీ – నీటిపారుదలతో పాటు క్లిష్టమైన అనుమతులు రక్షణశాఖ నుంచి 12 – విమానయాన శాఖ నుంచి 12 – గ్యాస్ పైప్ లైన్ కు సంబంధించి నాలుగుతో పాటు మొత్తం 171 అనుమతులను సాధించగలిగింది.

దేశంలో పేరేన్నికగన్న తెలంగాణ ట్రాన్స్ కో – తమిళనాడు ట్రాన్స్ కో – రాజస్థాన్ ట్రాన్స్ కో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల రికార్డులను అధిగమించి 13220 ఎంవీఏ సామర్థ్యం కలిగిన సబ్ స్టేషన్లను మేఘా ఏర్పాటు చేసి రికార్డు సృష్టించింది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో స్టేబుల్ ఔట్ లుక్ రేటింగ్ ను సాధించింది.

సరఫరా వ్యవస్థలో ఎటువంటి అంతరాయాలు ఏర్పడకుండా పటిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు యంత్రాంగాన్ని ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఏర్పాటు చేసుకుంది. ఇందుకోసం ఎంప్లాయిమెంట్ ఆఫ్ ఏమర్జెన్సీ రెస్టోరేషన్ సిస్టం (ERS) సిద్ధంగా ఉంది. ఏవైనా అవాంతరాలు ఎదురై సరఫరా నిలిచిపోయినా గంటల వ్యవధిలోనే పునరుద్ధరించే అత్యాధునికి టెక్నాలజీ వ్యవస్థ ఉంది.

అలాగే ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లు ముఖ్యంగా మిషన్ భగీరథ – పట్టిసీమ – హంద్రినీవా – పురుషోత్తపట్నం – భక్తరామదాసు లాంటి ప్రాజెక్టులతో పాటు  ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులోని కొన్ని ప్యాకేజీలను వేగంగా నిర్మిస్తూ తన ఘనతను చాటుకున్న మేఘా పవర్ ట్రాన్స్ మిషన్ రంగంలోనూ తన వెలుగులను విరజిమ్ముతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here