ఎండా వానల్లో సమంత షూటింగ్ కష్టాలు

సుకుమార్ దర్శకత్వం రాంచరణ్ హీరోగా రంగస్థలం సినిమా లో హీరోయిన్ గా నటిస్తున్న సమంత రాజమండ్రి పరిసరప్రాంతాల లో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం మండుటెండల్లో షూటింగ్ లో  పాల్గొనడం జరిగింది సమంతా. అయితే తాజాగా ప్రస్తుతం సమంత ఇంకో సినిమా కోసం మరో రకమైన కష్టాన్ని ఎదుర్కొంటోంది. విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కుతోన్న ‘సూపర్ డీలక్స్’ చిత్రం కోసం ఆమె రాత్రివేళల్లో వర్షంలో జరిపే షూటింగ్‌లో పాల్గొనాల్సి వస్తోందట పాపం.

చెన్నైలోని టెన్సకి ప్రాంతంలో ఈ చిత్రీకరణ జరుగుతోంది. సెట్‌కి  సంబంధించిన ఒక ఫొటోని కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.అంతేకాకుండా ఆ ఫోటోపై ఎండలో వర్షంలో నన్నెందుకు కష్ట పెడుతున్నావు అంటూ దేవుని ప్రశ్నిస్తూ ఏడుస్తున్న ఇమేజ్‌ను ఆమె జత చేసింది.ఈ సంవత్సరం సమంతా నటించిన చాలా సినిమాలు  విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో తన పాత్ర పూర్తవడంతో మిగతా సినిమాల మీద దృష్టి పెట్టింది హీరోయిన్ సమంత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here