మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఓ మాస్ మసాలా సినిమా రెడీ రెడి అవుతుందని మనకందరికీ తెలుసు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇటీవల. అయితే ఈ క్రమంలో రెండో షెడ్యూలు కూడా రెడీ అవుతోంది. ఈ సినిమాలో చరణ్ కి పెద్దన్నయ్య గా తమిళ స్టార్ హీరో ప్రశాంత్ నటించనున్నాడు.అయితే ఈ సినిమా లో రామ్ చరణ్ రెండో అన్నయ్యగా తెలుగు హీరో నవీన్ చంద్ర నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
తెలుగులో మంచి గుర్తింపు ఉన్న నవీన్ చంద్ర, ఈ సినిమాలో చరణ్ కి చిన్నన్నయ్యగా కనిపించనుండటం దాదాపు ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. సినిమాలో విలన్ పాత్రా బాలీవుడ్ కి చెందిన వివేక్ ఒబెరాయ్ చేస్తున్నాడు. చరణ్ కి వదిన పాత్రలో సీనియర్ హీరోయిన్ స్నేహ చేస్తుండటం విశేషం. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్, డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు ఈ సినిమాను.అయితే ఈ క్రమంలో మొదటి సినిమా షెడ్యూల్ లో పాల్గొనని రామ్ చరన్ రెండో షెడ్యూల్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.