శ్రీదేవి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు: వైఎస్ జగన్

భారతీయ చలనచిత్ర అందాల నటిని అతిలోక సుందరి శ్రీదేవి లాంటి పాటలు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైయస్ జగన్ తన సంతాపాన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ శ్రీదేవి మరణం పట్ల ప్రకటన విడుదల చేశారు. ‘శ్రీదేవి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నటన, ఛరిష్మాతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఆమె. దక్షిణ భాషలతోపాటు బాలీవుడ్‌లోనూ ఆమె నటించి అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. మరచిపోలేని పాత్రలేన్నో ఆమె పోషించి మెప్పించారు.
ఇంగ్లీష్‌ వింగ్లీష్‌లో గృహిణి పాత్ర శ్రీదేవి ఎంతటి అసమాన నటి అన్న విషయం తెలియజేసింది..ఆ లెజెండరీ నటి మృతి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా ఆమెను అభిమానించే వారికి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని వైఎస్‌ జగన్‌ తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.ప్రస్తుతం జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here