వైఎస్ పేరు నిల‌బెట్టిన హ‌ర్షారెడ్డి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంట్లో పండుగ వాత‌వ‌ర‌ణం నెల‌కొంది. ఇందుకు కార‌ణం వై.ఎస్ జ‌గ‌న్ పెద్ద కుమార్తె హ‌ర్ష రెడ్డినే. ఎందుకంటే ఈమెకు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు ల‌భించింది.

ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు దొర‌క‌డం అంత ఈజీ కాదు. ఈ స్కూల్‌లో సీటు తెచ్చుకున్న వారిని హైలీ టాలెంటెడ్ ప‌ర్స‌న్స్‌గా చెప్పుకుంటారు. అలాంటిది వై.ఎస్ జ‌గ‌న్ కూతురు ఈ ఘ‌న‌త సాధించింది. దీంతో ఇంట్లో సంబ‌రాలు చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈస్కూల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ చ‌దివేందుకు ఈమె పారిస్ వెళ్ల‌నున్నారు.

దీంతో సీఎం జ‌గ‌న్ ఈ నెల 25వ తేదీన బెంగుళూరు వెళ్లి కూతురుని విదేశాల‌కు పంపేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. కుటుంబం మొత్తం బెంగుళూరు వెళ్లనుంది. లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టి నుంచి సీఎం జ‌గ‌న్ మొద‌టిసారి రాష్ట్రం దాటి బ‌య‌ట‌కు వెళుతున్నారు. ఈ నెల 25న బెంగ‌ళూరు వెళ్లనున్న జ‌గ‌న్ 27న తిరిగి ఏపికి వ‌స్తారు.

గ‌తంలో కేంద్ర‌మంత్రి అమిత్‌షాతో భేటి అవ్వాల్సి ఉన్నా లాక్‌డౌన్ కార‌ణంగా వెళ్ల‌లేక‌పోయారు. అయితే ఇప్పుడు క‌రోనా నిబంధ‌న‌లు స‌డ‌లింపులు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో కూతురు కోసం ఆయ‌న బెంగ‌ళూరు వెళ్ల‌నున్నారు. అయితే వై.ఎస్ జ‌గ‌న్ కూతురు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత స్కూల్లో సీటు సాధించ‌డంపై వైసీపీ నేత‌ల‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here