క‌రోనాను జ‌యించిన బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం.. కొన‌సాగుతున్న వైద్యం

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు క‌రోనా నెగిటివ్ వ‌చ్చింది. ఈమేర‌కు ఆయ‌న కుమారుడు ఈ విష‌యాన్ని మీడియాకు వెళ్ల‌డించారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఇంకా హాస్పిట‌ల్‌లోనే చికిత్స తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ నెల 5వ తేదీన క‌రోనాతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిట‌ల్లో చేరిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు ఎంజీఎం హాస్పిట‌ల్‌లో ప్ర‌త్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. అయితే ఇటీవ‌ల ఆయ‌న ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌త వారం రోజులుగా బాలు ఐసీయూలోనే ఉన్నారు.

తాజాగా చేసిన కరోనా టెస్టుల్లో ఆయ‌న‌కు నెగిటివ్ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ప్ర‌ముఖ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఉన్న‌ట్లు తెలిసింది.  విదేశాల నుంచి వ‌చ్చిన 12 మంది వైద్యుల బృందం ఆయ‌న్ను ప‌రీక్షిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బాలు అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్న విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here