కోవిడ్ కేర్ సెంట‌ర్‌కు బాల‌య్య విరాళం.

సినీన‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ ప్ర‌జాసేవ‌తో పాటు స‌హాయ కార్య‌క్ర‌మాల్లో కూడా త‌న‌వంతు స‌హాయం అందిస్తూ ఉంటారు. బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి ద్వారా పేద ప్ర‌జ‌లకు వైద్యంలో ఎంతో తోడ్పాటు అందిస్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో కోవిడ్ కేర్ సెంట‌ర్‌కు రూ. 55 ల‌క్ష‌లు విరాళం అంద‌జేశారు. హిందూపురం గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్‌లోని కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో మెడిసిన్‌, పీపీఈ కిట్స్‌, మాస్కులు, ఇత‌ర ప‌రిక‌రాల కోసం అంద‌జేశారు. ఇక క‌రోనా స‌మ‌యంలో కూడా బాల‌య్య త‌న నియోజ‌క‌వ‌ర్గ అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుతూ వైద్య సేవ‌ల‌పై ఆరా తీసిన‌ట్లు తెలిసింది.

క‌రోనా లాక్‌డౌన్‌లో కూడా సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారి కోసం ప‌లు ర‌కాల మందుల‌ను ఆయ‌న ఉచితంగా అంద‌జేసిన విష‌యం తెలిసిందే. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధిగా రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి రూపాయల విరాళం ఇచ్చారు. మ‌రోసారి బాల‌య్య త‌న పెద్ద‌మ‌న‌సు చాటుకున్నార‌ని అభిమానులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here