హీరో గొప్పతనం యూట్యూబ్ లో ఉందా ? మిలియన్ వ్యూస్ పెద్ద గొప్ప కానే కాదు ?

ఒకప్పుడు వంద రోజులు , రెండొందల రోజులు రికార్డులు గా చెప్పుకునే వారు. ఇప్పుడు అంతా కలక్షన్ లే పారామీటర్ లు గా మారిపోయాయి. నెమ్మది నెమ్మదిగా కలక్షన్ లని యూ ట్యూబ్ వ్యూస్ గట్టిగా డామినేట్ చేస్తున్నాయి కూడా. యూ ట్యూబ్ లో ఏదైనా వీడియో లేదా టీజర్ రాగానే ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి అనేది ప్రామాణికం అయ్యింది. ప్రతీ ఒక్క హీరో కీ రెండేసి మూడేసి గంటల్లో మిలియన్ వ్యూస్ వచ్చేస్తున్నాయి . అందరి చేతిలో మొబైల్స్ ఉండడం, ఇంటర్నెట్ బాగా చవక అయిపోవడం తో చాలా తేలికగా రిపీట్ లతో వీడియో లు చూస్తున్నారు జనాలు.

సో ఫస్ట్ లుక్ టీజర్ లకి మిలియన్ వ్యూస్ ఇక రికార్డ్ కాదనే చెప్పలేమో. నెమ్మదిగా కోటి లేదా అరకోటి వ్యూస్ ని గొప్పగా చెప్పుకుంటే బాగుంటుంది ఏమో అంటున్నారు చాలా మంది. లైక్స్ , వ్యూస్ విషయం లో ఇదివరకు లాగా నెమ్మదిగా ఆసక్తి కూడా తగ్గుతోంది అనేవారూ ఉన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here