నా జీవితాన్ని సినిమాగా తీస్తే ఒప్పుకోను – మాజీ ముఖ్యమంత్రి వార్నింగ్ :

తన జీవిత చరిత్ర ని సినిమాగా తీయద్దు అనీ అలా తీయడానికి ఒప్పుకోను కూడా ఒప్పుకోను అనేసారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప. బీదర్ లోని హుడిగ గ్రామం లో ఒక దళితుడి ఇంట్లో భోజనం చేసిన ఆయన రుద్రేశ్ అనే వ్యక్తి తన జీవితాన్ని సినిమాగా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు అన్న వార్త తనకి తెలిసిందే అనీ అది తనకి ఇష్టం లేదు అనీ అన్నారు ” నా జీవితాన్ని సినిమాగా రుద్రేశ్ అనే వ్యక్తి తెరకి ఎక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు అని నేను ఎవరో చెప్పగా విన్నాను. మీ మీడియా కూడా చెబుతోంది అదే మాట కదా.

అయితే అతని అభిమానానికి థాంక్స్. నా జీవితం జనాలకి ఎప్పుడూ తెలిసింది. కొత్తగా చెప్పేది ఏమీ లేదు . నా జీవిత చరిత్రను సినిమాగా తీయాల్సిన అవసరం కూడా లేదు అనిఅనుకుంటున్నాను. వారు ఇంకా ఈ విషయం మీద నన్ను కలవలేదు. ఒకవేళ కలిస్తే అదే మాట చెబుతాను కూడా ” అన్నారు యడ్యూరప్ప

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here